రాజలింగమూర్తి కేసును సీబీఐకి అప్పగించాలి
హన్మకొండ: భూపాలపల్లిలో హత్యకు గురైన రాజ లింగమూర్తి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజలింగమూర్తిని హత్య చేసిన దుండగులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. పోలీసులు, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దన్నారు. రాష్ట్రంలో 13 నెలల్లో లెక్కలేనన్ని హత్యలు, లైంగికదాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, రాష్ట్రంలో హోం మంత్రిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య రాజకీయ పార్టీలకు బానిసయ్యాడని, బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బానిసలుగా ఉన్న బీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. తనను సీఎం చేయాలన్నారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్
Comments
Please login to add a commentAdd a comment