కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలి
● మైనింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్
కాళేశ్వరం: టీజీఎండీసీలో కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం జయశంకర్‌భూపాలపల్లి జి ల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్, ఎల్కే శ్వరం, అన్నారం, పలుగుల, పూసుకుపల్లి, మద్దులపల్లిలో ఇసుక రీచ్‌లను కలెక్టర్ రాహుల్‌శర్మ, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. ప్రతీ రోజు ఒక్కో క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తీస్తున్నారు?, రవాణా ఎలా చేస్తున్నారు?, తదితర విషయాలను టీజీఎండీసీ, మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24/7 ఇసుక కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. స్టాక్ పాయింట్, రీచ్‌లకు వచ్చే మార్గాల్లో సీసీ కెమెరాలు చేసి పటిష్ట పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న క్వారీల్లో రోజుకు 8–10 వేలమెట్రిక్ టన్నులకు పెంచాలని, రోజుకు 40–50వేల మెట్రిక్‌టన్నుల ఇసుక లోడింగ్ చేసే కొత్త ప్రాజెక్టులను గుర్తించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత రాకుండా స్టాక్ పెంచాలని ఆదేశించారు. కాంట్రాక్టర్‌కు క్రమం తప్పకుండా కమీషన్ చెల్లింపులు చేస్తామన్నారు. ఇసుక తీయడానికి అదనపు యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, పీఓ రంగారెడ్డి, మైనింగ్ ఏడీ జయరాజు, తహసీల్దార్ ప్రహ్లాద రాథోడ్, డీటీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment