భోజనాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
గూడూరు: ఆశ్రమ, గురుకుల, వసతి గృహాల్లో భోజనాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని దామరవంచ గిరిజన గురుకుల బాలుర పాఠశాల, గూడూరులోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దామరవంచ గురుకులంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ షెడ్, స్టోర్ రూం, డైనింగ్ హాల్, స్టడీ రూం, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం భోజన తయారీదారులతో మాట్లాడారు. మెనూ ప్రకారం పక్కాగా నాణ్యమైన అహార పదార్థాలను వండి వడ్డించాలన్నారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయ బృందం పరిసర ప్రాంత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చేయాలని సూచించారు. అలాగే గూడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో త హసీల్దార్ శ్వేత,ఎంపీడీఓ వీరస్వామి పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
బయ్యారం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని ఇర్సులాపురం ఆశ్రమపాఠశాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని కిచెన్‌షెడ్, స్టోర్‌రూం, టాయిలెట్స్, తరగతిగదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టువారీగా పలు అంశాలపై కలెక్టర్ ప్రశ్నలు అడిగారు.. అయితే వారి నుంచి సరైన సమాధానాలు రాకపోవడతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత సబ్జెక్టుల టీచర్లతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులందరూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచి బోధన చేయాలన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment