● రవాణాశాఖ కార్యాలయానికి కరెంట్ సరఫరా నిలిపివేత
● కలెక్టర్ మందలించడంతో పునరుద్ధరణ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 17న జిల్లా రవాణాశాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ రోడ్‌లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తు విద్యుత్‌శాఖకు చెందిన బొలెరో వాహనానికి జరిమానా విధించి కేసు నమోదు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌శాఖ అధికారులు మంగళవారం ఉదయం 9గంటలకు రవాణాశాఖ కార్యాలయానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ శాఖ ఏఈ, డీఈలకు ఫోన్ చేసినా స్పందిచలేదని, బొలెరో వాహనానికి జరిమానా వేసి, కేసు రాయడంతోనే కరెంట్ సరఫరా నిలిపివేశారని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు రవాణాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విద్యుత్‌శాఖ ఎస్‌ఈని ఫోన్‌లో మందలించడంతో మధ్యాహ్నం 1గంటకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment