భక్తులకు ఏర్పాట్లు చేయాలి
● ఆర్డీఓ కృష్ణవేణి
కురవి: వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆలయ పరిసరాలలో జరుగుతున్న జాతర పనులు, పెండింగ్ పనులను కురవి తహసీల్దార్ సునీల్‌రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావుతో కలిసి పరిశీలించారు. సంత ఆవరణ, నాగుమయ్య దేవస్థాన ఆవరణలోని కల్యాణమండపం, చెరువు కట్ట, ఎస్సారెస్పీ కాల్వ రోడ్డు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పలు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ కాల్వ రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసు అధికారులు డైవర్షన్‌ను పాటించాలని, ఖమ్మం నుంచి వచ్చే దారిలో ప్రమాదకరంగా మారిన వ్యవసాయ బావి వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, మహాశివరాత్రి రోజు బావి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఈనెల 25నుంచి జరిగే మహాజాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్, విద్యుత్‌శాఖ ఏఈ శారద, ఆలయ పాలకమండలి సభ్యులు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, జనార్దన్‌రెడ్డి, వెంపటి శ్రీను, భిక్షపతి, సోమ్లా, ఎంపీఓ గౌసు, కార్యదర్శి విజయలక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment