మరిపెడ పీఎస్ తనిఖీ
మరిపెడ: మరిపెడ పోలీస్‌స్టేషన్(పీఎస్)ను ఎస్పీ సుధీర్ రాంనాఽథ్‌కేకన్ తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల వినతులు క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలని, పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, డీసీఆర్సీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సైలు సతీష్, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment