సామాజిక శాస్త్రాల పరిశోధన పద్ధతులపై వర్క్‌షాప్
హన్మకొండ కల్చరల్ : పరిశోధన సిద్ధాంత గ్రంథాల రూపకల్పనపై అవగాహన కల్పించేందుకు సామాజిక శాస్త్రాల పరిశోధన పద్ధతులపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ భూక్య బాబురావు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం పీఠంలో ప్రొఫెసర్ బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేయూ ఓఎస్‌డీ మల్లారెడ్డి, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, పింగిళి కాలేజీ ప్రొఫెసర్ ధరావత్ పార్వతీనాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో జాతీయ వర్క్‌షాపు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఏప్రిల్ 8వ వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. వివరాలకు 90309 99640, 99891 39136 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఓఎస్‌డీ మల్లారెడ్డి మాట్లాడుతూ పరిశోధకులకు వర్క్‌షాప్ ఉపయోగపడుతుందన్నారు. ఏసీపీ నందిరాంనాయక్ మాట్లాడుతూ వర్క్‌షాప్‌తో పరిశోధకులకు సమగ్ర అవగాహన కలుగుతుందన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, డాక్టర్ బాసాని సురేశ్, అబ్బు గోపాల్‌రెడ్డి, వీడియోగ్రాఫర్ డాక్టర్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, ఆంజనేయులు, అశోక్, కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.
జానపద గిరిజన
విజ్ఞానపీఠం
పీఠాధిపతి బాబురావు
Comments
Please login to add a commentAdd a comment