8.810 కేజీల గంజాయి పట్టివేత
ఖానాపురం: 8 కేజీల 810 గ్రాముల గంజాయి పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఖానాపురం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై రఘుపతితో కలిసి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హసన్‌నగర్‌కు చెందిన అస్వద్, హైదరాబాద్‌లోని పోచమ్మ బస్తీకి చెందిన మోహిత్‌కుమార్, అమిత్‌కుమార్.. ఒడిశాలోని బరంపూర్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ గంజాయి అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గంజాయికి ఎక్కువ ధర ఉండడంతో రెండు రోజుల క్రితం ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. ఈనెల 14న మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం శివారులోని ఎఫ్‌సీఐ గోదాంల వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఇందులో రూ.2,20,250 విలువైన 8.810 కేజీల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ తెలిపారు.
ముగ్గురి అరెస్ట్, రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment