పాపం పసికందులు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్‌పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు.
నిద్రలోనే కన్నుమూసిన కవలలు
డబ్బా పాలే కారణమంటున్న తల్లి
గణపురం మండలం
నగరంపల్లిలో ఘటన
పాపం పసికందులు
Comments
Please login to add a commentAdd a comment