రైల్వేగేటు 6నెలల పాటు మూసివేత
గార్ల: గార్ల – డోర్నకల్ మధ్యలోని రైల్వేగేటు నేటి నుంచి 6 నెలలపాటు మూసివేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రైల్వేగేటు ప్రాంతంలో అండర్‌బ్రిడ్జి, సీతారామ ప్రాజెక్ట్ కాలువను నిర్మిస్తున్నందున మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారి గుండా ఖమ్మం, మహబూబా బాద్ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు.
జాతీయ లోక్ అదాలత్‌తో
కేసుల పరిష్కారం
● జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సరిత
తొర్రూరు: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌పై శనివారం డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సరిత మాట్లాడుతూ మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, తొర్రూరు కోర్టు పరిధిలో కేసులు నమోదై వ్యాజ్యం నడుస్తున్న సివిల్, క్రిమినల్, చెల్లని చెక్కులు, ప్రమాదాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా పరిష్కారమయ్యేందుకు చొరవ చూపాలన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశము ఉండదన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులపై కక్షిదారులతో చర్చించి పరిష్కారమయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐలు గణేష్, రాజ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
వీరభద్రుడి
కల్యాణ వేదిక సిద్ధం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈనెల 25వ తేదీన ప్రారంభం కానుండగా మహాశివరాత్రి సందర్భంగా 26న రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవానికి వేదికను శనివారం సిద్ధం చేశారు. వేదికతోపాటు భక్తులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. వీరభద్రస్వామి ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు కలకత్తా పెండల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయం, సత్రాలకు రంగులు వేశారు. విద్యుత్ దీపాలను అలంకరించారు.
రైల్వేగేటు 6నెలల పాటు మూసివేత
రైల్వేగేటు 6నెలల పాటు మూసివేత
Comments
Please login to add a commentAdd a comment