ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
గార్ల: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, పదో తరగతిలో విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని డీఈఓ రవీందర్‌రెడ్డి ఆదేశించారు. గార్లలోని జిల్లా పరిషత్ బాలి కోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కస్తూర్బాగాంధీ పాఠశాలలను ఆయన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమై న భోజనం అందించాలని కస్తూర్బాగాంధీ పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. తరగతి గదుల్లో టీవీల ద్వారా బోధిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. సీఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, హెచ్‌ఎంలు శివ, సుందర్‌కుమార్, ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు పరీక్షలు సిద్ధం కావాలి
డోర్నకల్: త్వరలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఉన్నందున విద్యార్థులు అన్నివిధాలా సిద్ధం కావాల ని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిలుకోడు శివారు మోడల్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మోడల్ స్కూళ్లలో విద్యాభోదన జరుగుతుండడం అభినందనీయమన్నారు. డోర్నకల్ మోడల్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రతీ సంవత్సరం జిల్లాస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. మోడల్ స్కూల్ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, ప్రతిభా పరీక్షలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నతస్థానాల్లో ఉన్నారని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు సిద్ధంగా ఉండాలని సూచించారు. వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మా, చిలుకోడు, మన్నెగూడెం హెచ్‌ఎంలు వీరభద్రరావ్, వి.సుధాకర్ పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment