ఎరువుల దుకాణాల్లో తనిఖీ
మహబూబాబాద్ రూరల్: ‘కార్డుపై రెండు బస్తాలే..’ శీర్షికన సొసైటీల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపుల అంశంపై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం యూరియా నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి.. రాబోయే 15 రోజులకు ఎంత యూరియా అవసరం ఉంటుందనే విషయాలను అంచనా వేసి ఉన్నత అధికారులకు తెలియజేశారు. యాసంగిలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలకు ఎరువులు సరిపడా ఉన్నాయని వెల్లడించారు. ఎరువుల డీలర్లు రైతులకు ఎమ్మార్పీ ధరలకే బిల్లుల ఇచ్చి ఈ పాస్ మిషన్ ద్వారా నమోదు చేసి యూరియా విక్రయించాలన్నారు. పంటల సాగు విషయంలో రైతులు ఎక్కువ మొత్తంలో యూరియా, రసాయనిక ఎరువులు వాడొద్దని సూచించారు. యూరియా అధికంగా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment