పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృిష్టి సారించాలి
మహబూబాబాద్: అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మానుకోట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, సిగ్నల్ కాలనీ సమీ పంలోని డంపింగ్ యార్డులోని బయోమైనింగ్ పనులను శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. అధికారులు ప్రతి రోజు పనులను పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వేసవి నేపథ్యంలో తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నోముల రవీందర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, రాజేశ్ పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
గూడూరు: ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలతోపాటు మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ గురుకులాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం త యారు చేసిన వంటకాలు, స్టోర్ గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరస్వామి, ఎంపీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.
వంద శాతం ఫలితాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకు అధికారులు, ప్రిన్సిపాళ్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన శనివారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..? పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. వంట గదులు, డైనింగ్ హాల్, నిత్యావసర సరుకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం విద్య, వైద్యం అందించాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృిష్టి సారించాలి
Comments
Please login to add a commentAdd a comment