పనిచేసే ఇంటికే కన్నం
మహబూబాబాద్ రూరల్ : ఓ మహిళ పని చేసే ఇంటికే కన్నం వేసింది. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడింది. జిల్లా కేంద్రంలో జరి గిన ఈ ఘటనకు సంబంధించి మహబూబా బాద్ డీఎస్పీ తిరుపతిరావు శనివారం రాత్రి టౌన్ పోలీసు స్టేషన్‌లో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మానుకోట పాతశివాలయం సమీ పంలో నివాసముండే పరకాల సుశీల తన ఇంటిలో చోరీ జరిగిందని ఈనెల 5వ తేదీన పోలీ సులకు ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ దేవేందర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చోరీ జరిగిన కొద్దిరోజుల తర్వాత నుంచి సుశీల ఇంట్లో పనిచేసే బానోత్ సుగుణ పనికిరావడం మానేసిందని తెలుసుకుని ఆమె ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చోరీ చేసినట్లు ఒప్పుకుంది. సుగుణ.. ఇళ్లలో పని చేయడానికి వచ్చిపోయే క్రమంలో గిరిప్రసాద్ నగర్‌కు చెందిన ఉప్పలి నవీన్ అనే వ్యక్తితో పరిచయం పెరిగింది. అదేసమయంలో నవీన్ ఆటో కొనడానికి డబ్బుల కోసం ప్రయ త్నిస్తున్నట్లు సుగుణకు చెప్పాడు. దీంతో ఇద్దరు ప్లాన్ చేసి సుశీల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. చోరీ చేసిన ఆభరణాలను బంగారం తయారు చేసే జాజురియ సంతోశ్ వద్ద కరిగించి, అమ్మిపెట్టమని కోరారు. సంతోశ్ తనకు వరుసకు బావ అయిన ఠాకూర్ శంకర్ సింగ్‌కు విష యం తెలిపాడు. ఎఫ్‌ఆర్‌ఓ సెంటర్ వద్ద ఉన్న అడానియ సంతోశ్‌కు రూ.5.10 లక్షలకు విక్రయించి, కొంత కమిషన్ ఇద్దరు తీసుకుని, రూ.4.20 లక్షలను నవీన్, సుగుణకు అప్పజెప్పారు. నవీన్ ఆటో కొనుక్కోడానికి రూ.1.05 లక్షలను తనకు పరిచయమున్న గుమ్ముడూరుకు చెందిన శాకుల శివమణి వద్ద దాచిపెట్టాడు. చోరీ చేసిన వస్తువుల్లోంచి బంగారపు రింగు ఇస్తానని ఇవ్వకపోయేసరికి శివమణి తనవద్ద దాచిన డబ్బులు వాడుకున్నాడు. విచారణ అనంతరం 7 తు లాల కరిగించిన బంగారం, 10 గ్రాముల బంగారపు రింగు, రూ.1.50 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, సుగుణ, నవీన్, సంతోశ్, శంకర్ సింగ్, సంతోశ్, శివమణిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ దేవేందర్, క్రైమ్ ఎస్సై వెంకటేశ్వర్లు, క్రైమ్ పార్టీ సిబ్బంది రుద్రయ్య, సుధీర్, నాగరాజును ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.
చోరీకి పాల్పడిన పని మనిషి
ఆరుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన
డీఎస్పీ తిరుపతిరావు
Comments
Please login to add a commentAdd a comment