ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థులను గెలిపించండి
నెహ్రూసెంటర్ : ఆత్మగౌరవం, రాజ్యాఽఽధికారం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలన్నీ ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులుగా అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చి బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి, బీసీ సామాజిక వర్గానికి చెందిన పూల రవీందర్‌ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి బీసీ ఐక్యతను చాటాలని కోరారు. అత్యధిక శాతం బీసీ ఉపాధ్యాయులే కీలకంగా ఉన్నారని, ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పుతాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యతతో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలన్నారు. బీసీలు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సత్తాచాటాలన్నారు. సమావేశంలో శ్రీనివాస్, తాటికొండ విక్రమ్‌గౌడ్, చెన్నూరు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు గుండగాని వేణు, ఎం. భూపతి, ఉపేంద్ర, సాయికుమార్, కుమార్, నరేశ్, యాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment