పబ్లిక్ గార్డెన్‌లో చికెన్ మేళా
హన్మకొండ చౌరస్తా: బర్డ్‌ఫ్లూ పై అపోహాలు తొలగించేందు నెక్, వెన్‌కాబ్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో చికెన్ మేళా నిర్వహించారు. దాదాపు 200 క్వింటాళ్ల చికెన్ కర్రీ, ఫ్రైతోపాటు, రెండు వేల గుడ్లతో భోజనం ఏర్పాటు చేశారు. 70 డిగ్రీల వేడిలో చికెన్‌ను ఉడికిస్తే ఎలాంటి వైరస్ అయినా చనిపోతుందని, ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ సోకిందని, మన రాష్ట్రంలో ఎలాంటి వైరస్ లేదని వెన్‌కాబ్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ బి. వెంకటేశ్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కనకం రాజు, పీబీసీఏ ఆఫీసర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment