నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 54 మంది బాలికలు, 56 మంది బాలురు ఉన్నారు. అయితే పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపోవడం లేదు. దీంతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో భాగంగా స్కూల్‌కు మంజూరైన నిధుల నుంచి బాలికల కోసం టాయిలెట్లు నిర్మించారు. అయితే పనులు పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నా.. పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
పైపులైన్ల నిర్మాణం మరిచారు..