మరిపెడ రూరల్: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించి, నాణ్యమైన విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ సీఈ రాజు చౌహాన్ అన్నారు. శనివారం మరిపెడ మండలం ఎల్లంపేట సబ్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట, సోమ్లతండా గ్రామాలను వేరు చేస్తూ విద్యుత్ అంతరాయం తగ్గించడంతో భాగంగా రూ.8.79 లక్షలతో మరో బ్రేకర్‌ను ఏర్పాటు చేయగా సీఈ రాజు చౌహాన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.3.26 లక్షలతో పోల్ స్ట్రక్షర్ అనుసందానం, ఆనెపురం స్టేజీ వద్ద రూ.2.25లక్షలతో కేపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ అంతరాయానికి తొర్రూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారుల చేస్తున్న కృషిని అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ జిల్లా అధికారి జి.నరేష్, ఎంఆర్‌టీ సునీతాదేవి, డీఈ మధుసూదన్, ఎల్లంపేట ఏఈ బి.అజయ్, లోక్‌నాథ్‌రెడ్డి, సబ్ ఇంజనీర్ రుబీనా తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ సీఈ రాజు చౌహాన్