
సమయం లేదు మిత్రమా..
జిల్లాలో 482 జీపీలు..
జిల్లాలో ప్రస్తుతం 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పాత జీపీలు 461 ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కాగా ఐదు గ్రామాలు ఆ మున్సిపాలిటీలో కలిశాయి. దీంతో జీపీల సంఖ్య 456కు తగ్గింది. అనంతరం కొత్తగా 26 జీపీలు ఏర్పాటు చేయడంతో సంఖ్య 482కి చేరింది. జిల్లాలో 428 మంది కార్యదర్శులు ఉండగా వారిలో 39జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 377మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్ సోర్సింగ్‌లో 12 మంది పనిచేస్తున్నారు. అలాగే 1,806 మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. కార్యదర్శులపై భారం ఉండడంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా జిల్లాలో 2,02,496 గృహాలు ఉన్నాయి
● గ్రామ పంచాయతీల్లో 85శాతం పన్నుల వసూలు
● గంగారం, డోర్నకల్,
చిన్నగూడూరులో వందశాతం పూర్తి
● మిలిగింది 7 రోజులే..
మహబూబాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు 85శాతం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల కంటే జీపీల్లో వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు. డిమాండ్ రూ.4,99,06,067 ఉండగా.. రూ.4,25,78,125 వసూళ్లు చేశారు. ఇంకా రూ.73,27,942 బ్యాలెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా.. వందశాతం వసూలు చేసేలా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
డిమాండ్
వసూళ్లు
శాతం
నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం జీపీ
మొత్తం మండలాల వారీగా పన్నుల డిమాండ్, వసూళ్లు, శాతం ఇలా..
85%

సమయం లేదు మిత్రమా..