చిన్నగూడూరు: అమెరికాలో జరిగిన మిసిస్సిప్పి 89వ వార్షిక అంతర్జాతీయ సదస్సులో మండల కేంద్రానికి మాటేటి శ్రీతేజ్ పాల్గొని సత్తాచాటాడు. ఉత్తమ ఓరల్ ప్రజంటేషన్ విభాగంలో అవార్డుతో పాటు నగదు బహుమతిని సాధించాడు. సోలనేషియస్ క్రాప్స్ ఇన్పెక్టింగ్ ప్లైటో ప్లాస్మాస్, సీడ్ ట్రాన్స్‌మిషన్ ఎపిడెమియోలాజికల్ ఇన్‌సైట్స్ అనే అంశంపై ప్రసంగించి అవార్డు గెలుచుకున్నాడు. విశ్వవేదికపై మెరవడంతో పాటు అవార్డును సొంత చేసుకోవడంతో వివిధ రంగాల ప్రముఖులు, పలు వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నా యి. కాగా శ్రీతేజ్ కుటుంబం కొన్నేళ్లక్రితమే ఉపాధి కోసం కాగజ్‌నగర్‌కు తరలివెళ్లి స్థిరపడింది.