వరంగల్: ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో నిబంధనలు పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో అందరూ సకాలంలో హాజరుకావాలన్నారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ఆయా స్పెల్ వారీగా శిక్షణఇచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయ నిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు.
డీఐఈఓ శ్రీధర్ సుమన్