కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం తరాలపల్లి ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్రామానికి చెందిన అంకేశ్వరపు సారయ్యకు కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సారయ్య అలియాస్ సుధాకర్, సుధీర్, ఎల్లన్న మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు బుధవారం ఛత్తీస్‌గఢ్ వెళ్లి అక్కడి కాంకేర్ ఆస్పత్రి నుంచి సారయ్య మృతదేహం తీసుకుని గురువారం ఉదయం స్వగ్రామం తరాలపల్లికి చేరుకున్నారు. ఇక్కడ అమరుల బంధు మిత్రుల సంఘం, విరసం నేతలు, పౌర హక్కుల సంఘం నాయకుల సందర్శన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. సారయ్య చితికి తన సోదరుడు రవీందర్ నిప్పంటించారు. అన్నా ఎక్కడ ఉన్నా బతికి వస్తావనుకున్నా.. కానీ ఇలా నీకు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని అనుకోలేదన్న అంటూ బోరున విలపించాడు. ఇంటి నుంచి శ్మశానం వరకు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు విప్లవ గీతాలు ఆలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు.
పలువురి పరామర్శ..
సారయ్య మృతదేహానికి తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మె ల్యేలు అరూరి రమేశ్, వినయ్‌భాస్కర్, కాంగ్రెస్ నా యకుడు నమిండ్ల శ్రీనివాస్, ఉద్యమ నాయకుడు గాదె ఇన్నయ్య, మావోయిస్టు నేత ఏసోబు కుమారుడు మహేశ్ తదితరులు నివాళులర్పించారు.
ఎరుపెక్కిన తరాలపల్లి
ముగిసిన ‘అంకేశ్వరపు’
అంత్యక్రియలు
పలువురి సంతాపం
సారయ్యకు కన్నీటి వీడ్కోలు
సారయ్యకు కన్నీటి వీడ్కోలు
సారయ్యకు కన్నీటి వీడ్కోలు