
చెరువులో మునిగి యువకుడి మృతి
● గణపురం మండల కేంద్రంలో ఘటన
గణపురం : ఉగాది పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండంలోని చెల్పూర్‌కు చెందిన ఎల్దండి విజయ్ (26) స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువులో స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో విజయ్ చిన్న మత్తడిలో కా లుజారి నీట ముని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ ఘటనా స్థలికి చే రుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు విజయ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.