
నేడు రాములోరి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: సర్వజగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణుడు లోక కల్యాణార్థం శ్రీరాము డి అవతారమెత్తి, భక్తుల కోరిక మేరకు కర్తవ్య నిర్వహణ చేసి, ధర్మ పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందారు. మర్యాదపురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి పేరుతో సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు ఎదు ట శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నేడు (ఆదివారం) వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ బాధ్యులు చౌడవరపు మోహన్‌రావు, ఓంనారాయణలోయ, డాక్టర్ వై.ఇంద్రసేనారెడ్డి, పల్ల పోతుల లక్ష్మినా రాయణ, పద్మం ప్రవీణ్ కుమార్ శనివారం తెలి పారు. బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా శ్రీవేణుగోపాలస్వామి వారి దేవాల యం, హన్మంతునిగడ్డ హనుమాన్ దేవాలయ ప్రాంగణం, రామచంద్రాపురం కాలనీలోని శ్రీరా మమందిరం, పట్టణ శివారులోని సాలార్‌తండా, ముడుపుగల్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం (గోవింద క్షేత్రం), శనిగపురం గ్రామంలోని శ్రీరామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆయా ఉత్సవ కమిటీల బాధ్యులు తెలిపారు.

నేడు రాములోరి కల్యాణం