
ఏఆర్‌లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పనేది?
కాకతీయ యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్లలో అర్హులకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించాల్సింది. అయితే ఆరేళ్లుగా పదోన్నతి కల్పించడం లేదు.దీంతో డిప్యూటీ రిజిస్ట్రార్ల పోస్టులు వెకేన్సీలుగా మిగిలిపోయాయి. కేయూలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 16 మంజూరు ఉన్నాయి. రెండు వెకేన్సీలుగా ఉండగా అందులో 14మంది పనిచేస్తున్నారు. ఇందులో ఒకరు ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌లో ఉన్నారు. మరొ అసిస్టెంట్ రిజిస్ట్రార్ తన ఇల్లు యూనివర్సిటీ భూమిలో ఉండడంతో ఆయన కూడా సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇంకొ మహిళా ఏఆర్ స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇక 11మంది అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు.