
రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి
డోర్నకల్: భారత రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిచారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. రాజ్యాంగం బీఆర్ అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్పవాళ్ల ఆలోచనలతో కూడిన పవిత్ర గ్రంథమన్నారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విష ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తిప్పి కొట్టాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌యాదవ్, మండల అధ్యక్షుడు డీఎస్ జగదీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసం శేఖర్, మూడు మండలాల ఇన్‌చార్జ్ కాలం రవీందర్‌రెడ్డి, నాయకులు ఆంగోత్ వెంకన్ననాయక్, తాళ్లూరి హనుమంతరావు, లాలూనా యక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదరాలి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే
దంతాలపల్లి: మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ సన్న బియ్యం సంబురాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని బేడబుడిగ కాలనీలో సమ్మక్క ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఆయన అధికారులు, నాయకులతో కలిసి తిన్నారు.