
రైతన్నకు తీరని నష్టం
మహబూబాబాద్ రూరల్ /బయ్యారం: అకాల వర్షం రైతన్నలకు శాపంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో మామిడికాయలు నేలరాలగా.. మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతి న్నాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షం ధాటికి తడిసిపోవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గాలిదుమారం, వర్షం కా రణంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు రోడ్లపై విరిగిపడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురుగాలులకు పెద్దపెద్ద చెట్లు విరిగి రోడ్లకు అడ్డుగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వివరాల సేకరణ..
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులు ఉదయం నుంచి నేలరాలిన మామిడికాయల వివరాలు సేకరించే పని మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతినగా, 128 మంది రైతులకు చెందిన 438 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించామని ఆయన తెలిపా రు. అలాగే జిల్లాలో 2,686 ఎకరాల్లో వరి, 130 ఎకరాల్లో మొక్కజొన్న, 4 ఎకరాల్లో సపోట తోటల దెబ్బతిన్నాయని డీఏఓ విజయనిర్మల తెలిపారు. ప్రాథమిక నష్టం అంచనా నివేదిక ప్రభుత్వానికి అందజేశామని పేర్కొన్నారు. ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయా యి. పలువురు ఇళ్లలో టీవీలు,ఫ్యాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు రోడ్లకు అడ్డుగా పడిన చెట్లను తొలగించడంతోపాటు విద్యుత్ స్తంభాలను సరిచేశారు.
167 విద్యుత్ స్తంభాలు నేలమట్టం
నెహ్రూసెంటర్: జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన ఈదురుగాలులు, వర్షానికి జిల్లాలో 167 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించామని ఎస్‌ఈ జనగాం నరేశ్ మంగళవారం తెలిపారు. ధ్వంసమైన పోల్స్ స్థానాల్లో కొత్తవి వేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 36వ వార్డులో పోల్స్ విరిగిపోగా పరిశీలించిన సీపీఐ మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథిరెడ్డి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు చేయించారు.
అకాల వర్షంతో నేలరాలిన మామిడికాయలు
దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు
రోడ్లపై విరిగిపడిన చెట్లు,
విద్యుత్ స్తంభాలు
పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

రైతన్నకు తీరని నష్టం

రైతన్నకు తీరని నష్టం