
అంబేడ్కర్ అందరివాడు..
మహబూబాబాద్ అర్బన్: అంబేడ్కర్ అందరివా డని, విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర ను తెలుసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధి కారి బి.నర్సింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతరత్నగా ప్రపంచంలోనే గొప్ప మేధావిగా గుర్తింపు పొందిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. వ్యాసరచన పోటీల విజేతలకు అంబేడ్కర్ జయంతిరోజు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ సభ్యు డు అశోక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల హెచ్‌ఎం సిరినాయక్ పాల్గొన్నారు.