
‘యూత్ పార్లమెంట్’లో కేయూ విద్యార్థిని ప్రతిభ
కేయూ క్యాంపస్ : ఢిల్లీలోని పార్లమెంట్‌లో ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ యూత్ పార్లమెంట్ వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై కేయూ బయోటెక్నాలజీ ఫైనలియర్ విద్యార్థిని శ్రీజాజాదవ్ పాల్గొని అనర్గలంగా ప్రసంగించారు. ‘ట్రాన్సిషనల్ మోడల్స్ ఇంప్లిమెంటేషన్ మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించి ప్రతిభ చాటారు. మంగళవారం శ్రీజాజాదవ్ కాకతీయ యూనివర్సిటీకి రాగా ఆమెకు విద్యార్థులు, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, పలువురు అధ్యాపకులు మొదటిగేట్‌వద్ద స్వాగతం పలికి బయోటెక్నాలజీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సన్మానించారు. అనంతరం వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం.. శ్రీజాజాదవ్‌ను పరిపాలనాభవనంలో అభినందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకులు టి.శాసి్త్ర, శ్రీనివాస్, కేయూఅభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన వీసీ, రిజిస్ట్రార్