
ఆర్ట్స్ కళాశాల సందర్శన
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ కార్యక్రమాల గురించి ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించారు. రాబోయే రోజుల్లో ఎన్‌సీసీ విభాగాన్ని మరింత పటిష్ట పరుస్తామన్నారు. ఎన్‌సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్‌ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు.