
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
గార్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న బీఆర్‌ఎన్‌తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన బుధ వారం పరిశీలించారు. ఇళ్ల బేస్‌మెంట్ పనులు పూర్తి కాగానే తొలిబిల్లు రూ.లక్ష లబ్ధిదారుడి అకౌంట్‌లో జమ చేస్తామన్నారు. విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. అనంతరం గార్ల ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీఓ మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అర్హులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని పే ర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, మహేశ్ తదితరులు ఉన్నారు.
రైతులు అధైర్యపడొద్దు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
నెల్లికుదురు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే భూక్య మురళీనా యక్ అన్నారు. మండలంలోని రాజులకొత్తపల్లితో పాటు పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న మామిడి, వరి, మొక్కజొన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ప్రకృతి వైపరిత్యం వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే నష్టపోయిన పంటలపై సమగ్ర సర్వే చేసి అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతుల ను ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, యాదవరెడ్డి, సత్యపాల్‌రెడ్డి, బాలాజీ నాయక్, లక్ష్మారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సబ్ సెంటర్లతో
మెరుగైన వైద్య సేవలు
డోర్నకల్: అందుబాటులోకి రానున్న సబ్ సెంటర్లతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జిల్లా వైద్యాధికారి రవిరాథోడ్ పేర్కొన్నారు. డోర్నకల్‌లోని శాంతినగర్, బైపాస్‌రోడ్డు, చర్చి కాంపౌండ్‌లో ప్రారంభానికి సిద్ధమైన సబ్ సెంటర్ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. డోర్నకల్‌లోని మూడు ప్రాంతాల్లో సబ్ సెంటర్ భవనాలు పూర్తిస్థా యి వసతులతో సిద్ధమయ్యాయని, గురువా రం ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీలారావు, ఎన్‌సీడీ పీఓ నాగేశ్వర్‌రావు, మండల వైద్యాధికారి సాధ్విజ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ రవి అన్నారు. బుధవారం ఎంఎల్‌హెచ్‌పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులను 12 వారాల్లో నమోదు చేయాలని, పీహెచ్‌సీ వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపువారికి టీకాల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని సూచించారు. ముప్పైఏళ్లు పైబడిన వారు బీపీ, షుగర్, కేన్సర్ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆబా కార్డు క్రియేట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీల, ప్రోగ్రాం అధికారులు సుధీర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, లక్ష్మీనారాయణ, సారంగం, డీపీఎం నీలోహాన, హెచ్‌ఈ కేవీ రాజు, గీత, డీడీఎం సౌమిత్, రాజ్‌కుమార్, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి