
డిప్యుటేషన్ల లొల్లి
సాక్షి, మహబూబాబాద్: ఎంత మంది అధికారులు వచ్చినా.. ఎవరు మారినా.. జిల్లా వైద్యారోగ్యశాఖలోని అధికారులు, ఉద్యోగుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులతో వెళ్లిన చోట పనిచేయకుండా కొందరు ఉద్యోగులు పైరవీలతో డిప్యుటేషన్లపై వేరేచో టుకు వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ప్రస్తు తం ఎక్కడి వారు అక్కడే పనిచేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడంతో తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిన వారు.. తప్పని పరిస్థితుల్లో మదర్ పోస్టింగ్ స్థానానికి వెళ్లాల్సి వస్తోంది. కాగా ఇన్నిరోజులు ఉన్నతాధికారులకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా డిప్యుటేషన్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతా గందరగోళం
కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌ఓ రవి జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు ఎవరెవరూ ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అంతా గందరగోళంగా ఉన్నట్లు స్పష్టమైంది. మదర్ పో స్టింగ్ ఎక్కడ అనే విషయంపై డిప్యుటేషన్లపై వచ్చి న వారు నోరు మెదపలేదని తెలిసింది. అయితే జి ల్లాలోని 21ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఒక బస్తీ దవాఖాన, అర్బన్ పీహెచ్‌సీల్లో ఎవరెవరూ పనిచేస్తున్నారనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం డాక్టర్ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వర కు వారివారి మదర్ పీహెచ్‌సీల్లో చేరాలని, అలా అయితేనే వచ్చే నెల వేతనాలు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. ఇందుకోసం వారం రోజుల గడు వు ఇచ్చి ఈలోపు అంతా పూర్తి కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు వెళ్లిందే ఉద్యో గం చేసిందే పని అన్నట్లుగా ఉన్న కొందరు అధికా రులు, సిబ్బంది మారుమూల ప్రాంతాల్లోని తమ మదర్ పోస్టింగ్‌కు వెళ్ల్లాల్సి వస్తోంది. మరికొందరు డిప్యుటేషన్ కొనసాగించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులతో పైరవీలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌ఓ డిప్యుటేషన్లు రద్దు చేస్తారా.. లేదా ఒత్తిడికి తలొగ్గి కొనసాగిస్తారా.. అలా చేస్తే జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది జిల్లాలో చర్చగా మారింది.
ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లపై కలెక్టర్ ఆగ్రహం
కొత్తగా ఎవరిని కదిలించొద్దని ఆదేశం
పాత డిప్యుటేషన్లు రద్దు చేయాలని సూచన
నూతన డీఎంహెచ్‌ఓకు తలనొప్పిగా మారిన వ్యవహారం
ఇష్టారాజ్యంగా..
గతంలో పనిచేసిన అధి కారులు, కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించి డిప్యుటేషన్లు వేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్‌వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, మూడు రకాల ఏఎన్‌ఎంలు, హెల్త్ ఎడ్యుకేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు మొత్తం 150మందికి పైగా ఉన్నట్లు సమాచారం. డిప్యుటేషన్ వేసినందుకు ఆశాఖలోని అధికారులకు ముడుపులు అప్పగించినట్లు జిల్లాలో చర్చ జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారి డిప్యుటేషన్లు రద్దు చేయాలని అదేశించారు. కాగా జిల్లా అధికారి ముందు తల ఊపిని వైద్యారోగ్యశాఖ అధికారులు కొందరి డిప్యుటేషన్లు రద్దు చేసి.. వారికి అనుకూలంగా ఉన్న వారిని అలాగే ఉంచినట్లు సమాచారం. తర్వాత మరికొందరు డిప్యుటేషన్లపై అనుకూల ప్రదేశాలకు వెళ్లేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలిసింది. అయితే గతంలో డిప్యుటేషన్ రద్దు చేసిన వారితో పాటు, కొత్తవారితో కూడిన జాబితాను తయారు చేసి.. అప్రూవల్ కోసం కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. ఈ విషయం ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కొత్త వారికి డిప్యుటేషన్లు ఇవ్వకపోగా.. ఇప్పటి వరకు డిప్యుటేషన్లపై పని చేస్తున్న వారి ఆర్డర్లు కూడా రద్దు చేయాలని ఆదేశించారు.
డిప్యుటేషన్లు రద్దు చేస్తాం ..
జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్ అంతా గందరగోళంగా ఉంది. దీనిని సరి చేసేందుకు ముందుగా పీహెచ్‌సీల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో తెలవడం లేదు. ఇందుకోసం ఉద్యోగుల వారీగా సమావేశాలు పెట్టి డిప్యుటేషన్లపై వెళ్లినవారు వారి సొంత పోస్టింగ్‌కు వెళ్లాలని చెప్పాం. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పుడు ఉద్యోగులపై ఒక అంచనా వస్తుంది.
– రవి, డీఎంహెచ్‌ఓ, మహబూబాబాద్

డిప్యుటేషన్ల లొల్లి