
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
నెల్లికుదురు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌తో కలిసి కవిత రజతోత్సవ మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, నాయకులు వెంకటేశ్వర్లు, బిక్కు నాయక్, కుమార్, అనిల్, ఆదిరెడ్డి, శ్రీనివాస్, విజయ్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు
మాలోతు కవిత