
మండుటెండలో.. మత్తడి
కురవి: ఒక వైపు ఎండలతో జనం అల్లాడిపోతున్నారు.. మరో వైపు కొన్నిచోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో మండలంలోని రాజోలు సమీపంలోని స్టేషన్‌గుండ్రాతిమడుగు గ్రామ శివారులో మున్నేరువాగుపై ఉన్న చెక్‌డ్యామ్ మత్తడిపోస్తూ కనువిందు చేస్తోంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చిన నీటితో మున్నేరువాగు చెక్‌డ్యామ్ అలుగుపోస్తున్నట్లు పలువురు రైతులు తెలిపా రు. చెక్‌డ్యామ్ మత్తడిపోస్తుండడంతో అన్నదా తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలుగుపోస్తున్న మున్నేరు వాగు
చెక్‌డ్యామ్