
నకిలీ వైద్యుడిపై కేసు
ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు.