
గార్ల రైల్వేగేట్ మూసివేత
గార్ల: గార్ల, డోర్నకల్ మధ్య గల రైల్వేగేట్ ఈనెల 18వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వేగేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కానందున ఈ నెల 18 వరకు మూసివేతను పొడగించామన్నారు. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారిగుండా ప్రయాణిస్తూ రైల్వే సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
మహనీయులను
ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: నేటి యువత, విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. బహుజన వాకర్స్ అసోసియషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మహనీయుల జయంతులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌ఎంఓ జగదీశ్వర్ హాజరై అంబేడ్కర్, సామ్రాట్ అశోక చక్రవరి, జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో బహుజన మహపురుషుల జయంతులు ఉన్నాయని, వారి మార్గమే బహుజనులకు శిరోధార్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ రాష్ట్ర నాయకుడు దార్ల శివరాజ్, వాకర్స్ మల్లికార్జున్, చందర్, శ్రీనివాస్, నాగరాజు, పవన్, రామకృష్ణ, సుని ల్, కిరణ్ తదితరలు పాల్గొన్నారు.
‘భూములను
కాజేసేందుకే వక్ఫ్ చట్టం’
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ చట్టంతో భూ ములను కాజేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్‌ఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్లిం వక్ఫ్ బిల్లుతో న్యాయం జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మానుకోటలో ముస్లింలు, హిందువులకు గొడవలు సృష్టించడానికే ఇలాంటి మా ట్లాడారన్నారు. ఈ సమావేశంలో ఎండీ. అ లీం, ఫీరోజ్‌ఖాన్, యాకూబ్, అన్సార్, జీయాఉద్దీన్,జహీర్ తదితరులు పాల్గొన్నారు.
సవాళ్లను అధిగమించాలి..
● సౌత్ ఆఫ్రికా దర్బన్ వర్సిటీ
ప్రొఫెసర్ రవీందర్‌రేనా
కేయూ క్యాంపస్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ విద్య అనేక సమస్యల్ని, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని నైపుణ్యాలతో అధిగమించాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో డైరెక్టర్, పాలక మండలి సభ్యులు బి.సురేశ్‌లాల్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థుల స మావేశంలో ఆయన వ్యాపార నిర్వహణ విద్య పై విస్తృతోపన్యాసం చేశారు. మేనేజ్‌మెంట్ వి ద్యతో బాధ్యతాయుతమైన నాయకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. సాంకేతికల ఏకీకరణ, సాఫ్ట్‌స్కిల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ మార్కెటింగ్, ఫైనాన్స్ మానవ వనరులకు మించిన క్రియాత్మక రంగాలపై విస్తృత అవగాహన అవసరముందన్నారు.సమావేశంలో అధ్యాపకులు డా క్టర్ వీణ, సుమలత తదితరులు పాల్గొన్నారు.
హరితకు
కూచిపూడిలో గిన్నిస్ రికార్డ్
హనుమకొండ కల్చ రల్: కూచిపూడి నృత్య ప్రదర్శనలో హనుమకొండ గౌతమ్‌నగర్ కాలనీకి చెందిన డాక్టర్ గుంటోజు హరిత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సాధించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ప్రపంచ కూచిపూడి నతృ ప్రదర్శనలో ఆమె ప్రతిభ కనబర్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 4,218 మంది నృత్య కళాకారులు పాల్గొనగా.. హరిత ప్రదర్శించిన నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. హనుమకొండలో హరితా కృష్ణ కూచిపూడి నృత్య కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఆమె ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. ఈమేరకు శనివారం సాయంత్రం నృత్య శిక్షణ కళాశాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన డాక్టర్ హరితకు శిక్షణ పొందిన విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి శా లువాతో ఘనంగా సత్కరించారు.

గార్ల రైల్వేగేట్ మూసివేత