
నిరుపేదలందరికీ నూతన రేషన్ కార్డులు
● రాష్ట్ర మంత్రి సీతక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: రానున్న రోజుల్లో రేషన్ కార్డు లేని నిరుపేదలందరికీ నూతన కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మండలంలోని మండలతోగు గూడెంలోని పాఠశాలలో గొత్తికోయలు, విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలు కడుపునిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రెండు లక్షల 57 వేల మందికి సన్న బియ్యం అందజేస్తున్నామని వివరించారు. ఆదివాసీ గూడేలు, ఏజెన్సీ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేశ్‌బాబు, ఎంపీడీఓ సుమనవాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ పాల్గొన్నారు.