
ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో బాలుడి బలి..
● ట్రాలీ మీద పడి దుర్మరణం
● గిర్నితండాలో ఘటన
కొడకండ్ల : ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడు బలి అయ్యాడు. ట్రాక్టర్ ట్రాలీ మీద పడి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం తెల్లవారుజామున మండలంలోని గిర్నితండా శివారులోని పెట్రోల్ బంక్ ఎదుట ఉన్న ఇటుకబట్టీల వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై చింత రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వేరుపాలెం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ కృష్ణ కొడకండ్ల మండలం గిర్నితండా పరిధిలోని పెట్రోల్ బంక్ ఎదుట ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. ఇటుక బట్టీలకు మట్టి సరఫరా చేసే క్రమంలో ట్రాక్టర్ల లెక్కింపు చేపట్టేందుకు మొండ్రాయి గ్రామానికి చెందిన బాలుడు తండా విఘ్నేశ్(17)ను పనికి కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో బోడోనికుంటకు చెందిన భూక్య రవి.. మట్టి ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడపడంతో ట్రాలీ పల్టీకొట్టి పక్కన ట్రిప్పుల లెక్క రాస్తున్న విఘ్నేశ్‌పై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విగ్నేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న తండా భాస్కర్‌కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు విఘ్నేశ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడిపి తన కుమారుడి మృతికి కారణమైన డ్రైవర్‌తో పాటు మైనర్ అని తెలిసినా పనికి కుదుర్చుకున్న ఇటుక బట్టీ యాజమానిపై చర్యలు తీసుకోవాలనే మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయం
● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్
విద్యారణ్యపురి: న్యాయవాది కేఎస్‌ఆర్ జి.ప్రసా ద్ ఆలోచన విధానం ఆదర్శనీయమని ప్రముఖ నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ నివాసంలో మిత్రమండలి, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కేఎస్‌ఆర్ జి.ప్రసాద్ జీవితం, కృషి, వర్తమానం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హా జరైన ఆయన మాట్లాడుతూ.. ప్రసాద్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో రచయిత, విమర్శకుడు మెట్టు రవీందర్, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, న్యాయవాది దివంగత కేఎస్‌ఆర్ జి.ప్రసాద్ కుమారుడు డా క్టర్ సతీశ్‌చంద్ర, మిత్ర మండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి, తెరసం అధ్యక్షుడు పొట్లపెల్లి శ్రీనివాస్ రావు, రుద్రమ సాహిత్య సామాజిక వేదిక బాధ్యురాలు కొమర్రాజు రామలక్ష్మీప్రసాద్ జీవితాన్ని పరిచయం చేశారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, పి.చందు, బిల్ల మహేందర్, చందనాల సుమిత్రాదేవి, డి.శశికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో బాలుడి బలి..