
రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాలకు సిద్ధం
మరిపెడ రూరల్: రాజ్యాధికారంమే లక్ష్యంగా యాదవులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఊడుగుల ఐలేష్ యాదవ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండలంలో యా దవ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దొడ్డి కొమురమ్మ ఉద్యమ స్ఫూర్తితో పోరా టం చేసి రాజ్యాధికారం సాధించాలన్నారు. రాబో యే ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు జనరల్ స్థానాల్లో అవకాశం కల్పించా లన్నారు. 50 ఏళ్లు నిండిన గొర్రెలకాపరులకు రూ.3 వేలు పింఛన్ అందించాలని డియాండ్ చేశారు.
జిల్లా కమిటీ ఎన్నిక..
అనంతరం సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కలంచర్ల తిరుపయ్య, గౌరవ అధ్యక్షుడిగా బోర గంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి శ్రీనివాస్, కార్యదర్శిగా దొడ్డ ఉపేందర్ జిల్లా కోశాధికారిగా ఏర్పుల లింగయ్య, ఉపాధ్యక్షుడిగా కే.వెంకన్న, సభ్యులుగా శ్రీనివాస్, భిక్షం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు.