
ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన అంబేడ్కర్
ఖిలావరంగల్: దేశ ఔన్నత్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ.. రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత రూప శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్‌తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకం అన్నారు. పౌరుడి నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ ఫౌండేషన్ దాత మెరుగు అశోక్, విగ్రహ దాత రేణుకుంట్ల రవీందర్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొలేపాక నరేందర్, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివ, నాయకులు దిడ్డి కుమారస్వామి, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, శామంతుల శ్రీనివాస్, గడ్డం రవి, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్ పాల్గొన్నారు.
సమసమాజ స్వాప్నికుడు..
వరంగల్: సమసమాజ స్వాప్నికుడు బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన అంబేడ్కర్