కోళ్ల దాణా పరిశ్రమ తనిఖీ
భూత్పూర్: అమిస్తాపూర్ సమీపంలోని నోవెల్‌టెక్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను జిల్లా పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి మధుసూదన్‌గౌడ్, జేడీ మమత, తహసీల్దార్ జయలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వనపర్తి జిల్లాలోని ఓ కోళ్ల ఫాంలో కోళ్లు బర్డ్‌ఫ్లూ వ్యాధితో మృతిచెందగా.. వాటికి ఇక్కడి నుంచే దాణ సరఫరా చేస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు మధుసూదన్‌గౌడ్ తెలిపారు. దాణాను శాంపిల్స్ సేకరించామని, పరిశ్రమకు వచ్చే వాహనాలకు ప్రతిరోజు శానిటేషన్ చేయాలని పరిశ్రమ సిబ్బందికి సూచించామని చెప్పారు. పూర్తి నివేదికను కలెక్టర్ అందజేస్తామని పేర్కొన్నారు. వారి వెంట మండల పశువైద్యాధికారి మధుసూదన్, ఆర్‌ఐలు వెంకటేష్, బాలసుబ్రమణ్యం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment