3న ఎంవీఎస్‌లో జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ– ఆర్థికాభివృద్ధి– అవకాశాలు’, ‘సవాళ్లు ఎంఎస్‌ఎంఈల పాత్ర’ అనే అంశంపై వచ్చే నెల 3న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పీయూ వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ రాజ్‌కుమార్ తదితరులు హాజరవుతారన్నారు.
ఆముదాలు క్వింటాల్ రూ.5,750
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన ఈ టెండర్లలో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,750 ధర లభించింది. అలాగే రాగులు క్వింటాల్ సరాసరిగా రూ.4,204 ధర పలికింది. సీజన్ లేకపోవడంతో మార్కెట్‌లో లావాదేవీలు మందకోడిగా సాగాయి.
ఐదురోజుల పనివిధానం అమలుచేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: బ్యాంకులో ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని ఎస్‌బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్‌కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని ఎస్‌బీఐ రీజినల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల పిలుపుమేరకు వచ్చే నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దశల వారీగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న అన్నిస్థాయిల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ పద్ధతిని తీసివేయాలని, తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment