చదువుంటేనే భవిష్యత్‌కు భరోసా
హన్వాడ: చదువుంటేనే భవిష్యత్‌కు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని చిన్నదర్పల్లి, మునిమోక్షం, గొండ్యాల్, వేపూర్ గ్రామాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం తన సొంత నిధులతో 2డీ, 3డీ యానిమేషన్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే నెల రోజులపాటు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ నెలరోజులపాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ బాలుయాదవ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, కార్యదర్శులు కృష్ణయ్య, కృష్ణయ్యయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్, ఏఎంసీ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటాద్రి, అచ్చెన్న తదితరులు పాల్గొన్నారు.
ఉదండాపూర్‌లో రీసర్వే ప్రారంభం
జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్‌లో శుక్రవారం అధికారులు రీ సర్వే చేపట్టారు. జిల్లా నుంచి వచ్చిన మొత్తం 11 బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. అదనపు కలెక్టర్ మోహన్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్‌కుమార్, స్థానిక తహసీల్దార్ నర్సింగరావు తదితరులు సర్వేను పరిశీలించారు. అయితే మొదటిరోజు 113 ఇళ్లను సర్వే చేశారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు సర్వే కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
చదువుంటేనే భవిష్యత్‌కు భరోసా
Comments
Please login to add a commentAdd a comment