సోషలిజం వైపు ప్రపంచ పయనం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో రెడ్‌బుక్ డేను పురస్కరించుకొని రాజకీయ సమీక్ష నివేదిక, సీపీఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానాలపై ఒకరోజు అధ్యయనం, పుస్తక పఠనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం సోషలిజం వైపు పయనిస్తుందన్నారు. పెట్టుబడిదారీ విధానంలో రోజురోజుకు సంక్షోభాలు ముదురుతున్నాయన్నారు. వియత్నాం, చైనా, క్యూబ, ఉత్తరకొరియా, శ్రీలంక, దావోస్ లాంటి దేశాల్లో కమ్యూనిజం సోషలిజం వేగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. యువతీ, యువకులు, అభ్యుదయవాదులు, మేధావులు పుస్తక అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, కార్యవర్గ సభ్యులు కురుమూర్తి, రాంరెడ్డి, మోహన్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment