రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 4 బంగారు, 5 రజతం, 1 కాంస్య పతకాలు సాధించి సత్తాచాటారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం క్రీడాకారులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్‌కుమార్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర అభినందించి.. శాలువాలతో సత్కరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, కోచ్‌లు ఆనంద్, సునీల్‌కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
9 పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment