జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్‌ఆర్‌లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment