శిథిలాల తొలగింపు షురూ | - | Sakshi
Sakshi News home page

శిథిలాల తొలగింపు షురూ

Published Fri, Feb 28 2025 1:37 AM | Last Updated on Fri, Feb 28 2025 1:32 AM

శిథిల

శిథిలాల తొలగింపు షురూ

లోకో ట్రైన్‌ మూడు కోచ్‌ల ద్వారా మట్టి వెలుపలికి..

అచ్చంపేట/ అచ్చంపేట రూరల్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలే దు. టన్నెల్‌ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్‌ గురువారం మొదలైంది. సహాయక చర్య ల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్‌ మూడు కోచ్‌ ద్వారా మట్టి శిథిలాలను తీసుకొ చ్చారు. టీబీఎం మిషన్‌ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్‌ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ., వద్ద టీబీఎం మిషన్‌ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్‌ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్‌ చివరి వరకు లోకో ట్రైన్‌ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందు కు లోకో ట్రైన్‌ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్‌ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా ప్రతిష్టమైన పునఃనిర్మాణం చేస్తున్నారు.అయితే దెబ్బతిన్న కన్వేయర్‌ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్‌ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది.

● టన్నెల్‌లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్‌ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్‌పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్‌ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

కఠిన ఆంక్షలు..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్‌ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. టన్నెల్‌ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు.

ఎన్‌జీఆర్‌ఐ ప్రత్యేక బృందం..

సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్‌జీఆర్‌ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్‌ ప్రోబింగ్‌ రాడార్‌ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

టెన్షన్‌.. టెన్షన్‌

మాజీమంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను టన్నెల్‌ లోపలికి అనుమతించకపోవడంతో జేపీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. టన్నెల్‌ సందర్శనకు వచ్చిన బృందాన్ని పోలీసులు ముందుగా దోమలపెంట ఫారెస్టు చెక్‌పోస్టు, జేపీ కార్యాలయానికి వెళ్లే గేటు వద్ద, సొరంగం మార్గం రహదారిలో మూడు చోట్ల అడ్డుకుని తనిఖీలు చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన వాహనాలను లోపలికి పంపించకుండా ఫారెస్టు చెక్‌పోస్టు వద్దే అడ్డుకున్నారు. పోలీసులు చివరికి హరీశ్‌రావుతోపాటు ముఖ్య నాయకులు 10 మంది మాత్రమే లోపలికి పంపించారు. సొరంగం వద్దకు వెళ్లేందుకు ముందు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించడంతో హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టన్నెల్‌ లోపలికి అనుమతించడంతో బీఆర్‌ఎస్‌ బృందం సొరంగం వద్దకు చేరుకుని రెస్క్యూ టీం సభ్యులు, ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం జేపీ కార్యాలయం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, జేపీ కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్‌తో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని పోలీసుల ద్వారా సమాచారం పంపించారు. కానీ, వారెవరనూ రాకపోవడంతో జేపీ కార్యాలయం గేటు వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బయటికి రావాలని, అధికారులు వచ్చి తమతో మాట్లాడాలని నిరసన తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌తో పాటు మరో మూడు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీకి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులలో నీళ్లను కూడా కాపాడలేకపోతున్నారని, శ్రీశైలం అడుగంటిందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం మీద పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల ప్రాజెక్టుల ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాల్సి ఉండగా.. ఇప్పటికే శ్రీశైలం ఖాళీ అవుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లోపనిచేస్తున్న రెస్క్యూ బృందాలు

ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ

ఆరు రోజులైనా మరమ్మతుకు

నోచుకోని కన్వేయర్‌ బెల్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శిథిలాల తొలగింపు షురూ 1
1/1

శిథిలాల తొలగింపు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement