క్రమబద్ధీకరణ చేసుకుంటే 25% రాయితీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగ్‌లను క్షేత్రస్థాయి వెరిఫికేషన్, క్రమబద్ధీకరణ రుసుం చెల్లింపునకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నగర, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు నిర్వహించాలని, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోల ద్వారా, ఆడియో రికార్డు ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు రుసం మార్చి 31లోగా చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment