పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కౌసర్‌జహాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలలో సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాల్లో జనరల్ 8,916, ఒకేషనల్ 2,006 మొత్తం 10,922 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్, 36 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 92402 05555 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. డీసీఈ సభ్యులు ఉమామహేశ్వర్, రవీందర్, గోపాల్, సందీప్‌కుమార్, సాధిక్ పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కౌసర్‌జహాన్
Comments
Please login to add a commentAdd a comment