కాలం చెల్లిన వాహనం.. కాలుష్య కారకం
● 15 ఏళ్లుపై బడిన వెహికిల్స్‌తో తీవ్రమైన కాలుష్యం
● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు
● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు
పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్‌లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కాలం చెల్లిన వాహనం.. కాలుష్య కారకం
Comments
Please login to add a commentAdd a comment